1. 13 స్వర్ణాలు సహా మొత్తం 39 పతకాలతో 2026 కామన్‌వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది?
What was India's final position on the medal tally at the 2026 Commonwealth Games, with a total of 39 medals including 13 gold medals?
View Answer & Key Points
సమాధానం: 4వ స్థానం / 4th
ముఖ్యమైన పాయింట్లు:
- వేదిక (Venue): గ్లాస్గో, స్కాట్లాండ్ (Glasgow, Scotland).
- భారత్ సాధించిన పతకాలు: మొత్తం 39 (13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంశ్యాలు).
- టాప్ స్పోర్ట్: బాక్సింగ్‌లోనే భారత్‌కు అత్యధికంగా 7 స్వర్ణాలు వచ్చాయి.
- మొదటి స్థానం: ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలిచింది.
2. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మొదటి మహిళా డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
Who was appointed as the first female Director General of the Geological Survey of India (GSI)?
View Answer & Key Points
సమాధానం: వర్షా అశోక్ అగ్లావే / Varsha Ashok Aglave
ముఖ్యమైన పాయింట్లు:
- 175 సంవత్సరాల పైచిలుకు చరిత్ర కలిగిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) కు నాయకత్వం వహించనున్న మొదటి మహిళా అధికారి వర్షా అశోక్ అగ్లావే.
- GSI ప్రధాన కార్యాలయం కోల్‌కతా (పశ్చిమ బెంగాల్) లో ఉంది.
- ఇది కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ (Ministry of Mines) కింద పనిచేస్తుంది.
- భారతదేశంలో భూగర్భ పరిశోధనలు, ఖనిజ వనరుల గుర్తింపు మరియు సర్వేలు నిర్వహించడంలో GSI కీలక పాత్ర పోషిస్తుంది.
3. ఇటీవల రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లా పొఖ్రాన్ రేంజ్‌లో డ్రోన్ ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యాలను పరీక్షించడానికి "రోటార్ క్లాప్ III" హెలికాప్టర్ పోరాట విన్యాసాలను ఏ రక్షణ దళం నిర్వహించింది?
Which defence force conducted the "ROTOR CLAPP III" helicopter exercise in Pokhran Range, Rajasthan to test Counter-UAS and tactical capabilities?
View Answer & Key Points
సమాధానం: భారత వాయుసేన / Indian Air Force (IAF)
ముఖ్యమైన పాయింట్లు:
- ప్రాంతం: రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లా పరిధిలోని పొఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్.
- ఈ విన్యాసాలను కేవలం భారత వాయుసేన (IAF) మాత్రమే తన అంతర్గత హెలికాప్టర్ స్క్వాడ్రన్లతో ప్రత్యేకంగా నిర్వహించింది.
- స్వదేశీ ప్రచండ్ (LCH), రుద్ర, ALH ధ్రువ్‌లతో పాటు అపాచీ, చినూక్ మరియు Mi హెలికాప్టర్లు పాల్గొన్నాయి.
- ప్రధాన లక్ష్యం: యుద్ధ రంగంలో డ్రోన్లు/అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ (Counter-UAS) వల్ల వచ్చే ముప్పును హెలికాప్టర్ల ద్వారా గుర్తించి అడ్డుకోవడం.
4. ఇటీవల ఆగస్టు 2026లో జరిగిన తైపే ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచి, ఈ టోర్నమెంట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కురాలైన విజేతగా నిలిచిన భారతీయ క్రీడాకారిణి ఎవరు?
Which Indian shuttler became the youngest overall champion in the history of the Taipei Open Super 300 badminton tournament by winning the women's singles title in August 2026?
View Answer & Key Points
సమాధానం: తన్వి శర్మ / Tanvi Sharma
ముఖ్యమైన పాయింట్లు:
- కేవలం 17 సంవత్సరాల 222 రోజుల వయస్సులోనే తన్వి శర్మ తైపే ఓపెన్ గెలిచింది.
- మహిళల సింగిల్స్: తైవాన్ దిగ్గజం తై త్జు యింగ్ (18 ఏళ్ల 109 రోజులు) రికార్డును బద్దలు కొట్టింది.
- 2008లో సైనా నెహ్వాల్ తర్వాత ఈ టైటిల్ గెలిచిన రెండో భారతీయ క్రీడాకారిణి.
5. 'కాశీ డిక్లరేషన్' ను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచడానికి "వికసిత్ భారత్ కోసం మత్తు రహిత యువత" జాతీయ ప్రతిజ్ఞ ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు?
Who launched the nationwide "Drug Free Youth for Developed India Pledge Campaign" under the Kashi Declaration to combat drug abuse among youth?
View Answer & Key Points
సమాధానం: నరేంద్ర మోదీ / Narendra Modi
ముఖ్యమైన పాయింట్లు:
- ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి (కాశీ) లో నిర్వహించిన 'యువ ఆధ్యాత్మిక సదస్సు' లో దీనిని ఆమోదించారు.
- కార్యక్రమ ఉద్దేశం: 'నషా ముక్త్ భారత్ అభియాన్' (NMBA) కు మద్దతుగా విద్యార్థులతో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించడం.
- కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మరియు 'మేరా యువ భారత్' ద్వారా అమలవుతోంది.
6. రిటైర్ అయ్యే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి, పారదర్శకతను పెంచడానికి ఇటీవల ఏ ఈశాన్య రాష్ట్రం 'ఇ-భవిష్య' ఆన్‌లైన్ పెన్షన్ పోర్టల్‌ను ప్రారంభించింది?
Which Northeastern state launched the 'e-Bhavishya' online pension portal to streamline and automate the pension sanction and payment tracking process for retiring state government employees?
View Answer & Key Points
సమాధానం: అరుణాచల్ ప్రదేశ్ / Arunachal Pradesh
ముఖ్యమైన పాయింట్లు:
- అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఈ డిజిటల్ పెన్షన్ సిస్టమ్‌ను ప్రారంభించారు.
- లక్ష్యం: ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ఆర్డర్లు (PPO), గ్రాట్యుటీని సకాలంలో అందించడం.
- కేంద్ర ప్రభుత్వ 'భవిష్య' పోర్టల్ మార్గదర్శకాల ఆధారంగా దీనిని రూపొందించారు.
7. ఉత్తర ఆఫ్రికా తీరంలో ఉన్న స్పెయిన్ భూభాగం 'సెయుటా' వైపు సముద్ర మార్గం మరియు సరిహద్దు ఫెన్సింగ్ ద్వారా ప్రవేశించడానికి ప్రయత్నించిన వలసదారుల మరణించిన సంఘటన ఇటీవల ఏ రెండు దేశాల మధ్య సరిహద్దు సంక్షోభానికి దారితీసింది?
The migrant crisis at the Ceuta border recently escalated tensions between which two countries?
View Answer & Key Points
సమాధానం: స్పెయిన్ మరియు మొరాకో / Spain & Morocco
ముఖ్యమైన పాయింట్లు:
- 'సెయుటా' మరియు 'మెలిల్లా' అనేవి ఉత్తర ఆఫ్రికా ఖండంలో ఉన్న స్పెయిన్ స్వయంప్రతిపత్తి కలిగిన నగరాలు.
- ఆఫ్రికా ఖండంలో యూరోపియన్ యూనియన్ (EU) కు ఉన్న ఏకైక ల్యాండ్ బోర్డర్స్ ఇవే.
- సరిహద్దు దాటడానికి చేసిన యత్నాల్లో వలసదారులు మరణించడం వల్ల వివాదం నెలకొంది.
8. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ పయనీర్ ఓవర్సీస్ కార్పొరేషన్ నుండి పొందిన ₹8.22 కోట్ల 'యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్' నిధులను పంపిణీ చేయగా... భారతదేశంలోనే మూడో అత్యధిక నిధులు పొందిన రాష్ట్రం ఏది?
Based on the paddy acreage data utilized by the National Biodiversity Authority (NBA) for allocating Access and Benefit Sharing (ABS) funds, which state ranked 3rd in the country?
View Answer & Key Points
సమాధానం: తెలంగాణ / Telangana
ముఖ్యమైన పాయింట్లు:
- టాప్ 3 రాష్ట్రాలు: 1. ఉత్తరప్రదేశ్, 2. పశ్చిమ బెంగాల్, 3. తెలంగాణ.
- ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో నిలిచింది.
- హైదరాబాద్‌లోని ICAR-IIRR కి అత్యధికంగా ₹2.43 కోట్లు లభించాయి.
9. ఆంధ్రా–ఆస్ట్రేలియా ద్వైపాక్షిక భాగస్వామ్యంలో భాగంగా, 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సోలార్ మాన్యుఫాక్చరింగ్' ను ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రతిష్టాత్మక సంస్థలో ఏర్పాటు చేయడానికి అవగాహన ఒప్పందం కుదిరింది?
As part of the Andhra Pradesh-Australia bilateral partnership, a Centre of Excellence in Solar Manufacturing is being established at which prominent institution in Andhra Pradesh?
View Answer & Key Points
సమాధానం: IIT తిరుపతి / IIT Tirupati
ముఖ్యమైన పాయింట్లు:
- అమరావతిలో ఏపీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒప్పందం కుదిరింది.
- భాగస్వామ్య సంస్థలు: IIT తిరుపతి, UNSW (సిడ్నీ), CoEET (విశాఖపట్నం).
- ప్రధాన లక్ష్యం: సోలార్ ఫోటోవోల్టాయిక్ (PV) తయారీ మరియు క్లీన్ ఎనర్జీ పరిశోధనలు.
No comments:
Post a Comment